మరపు రాని అనుభవాలు

ఒక 80 ఏళ్ళ వయస్సు గల వ్యక్తితో అనుభవం:
హరికిషన్ గారూ నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. నేను రోజుకి 40 టాబ్లెట్స్ వేసుకునేవాణ్ణి ఆరోగ్యరీత్యా. ఐతే నేను ఈటీవీ లో మీ నవ్వితే నవరత్నాలు ప్రోగ్రామ్ రెగ్య్లులర్ గా చూసేవాణ్ణి. చూడడమే కాదు మీతో మాట్లాడటం కూడా జరిగింది. డాక్టర్ చెప్పిన ఎడ్వైస్ ప్రకారం కాకుండా నా అంతట నేనుగా మందులు వాడటం మానేశాను. నవ్వు మంచి ఔషధం. అది కూడా మోతాదు మించితే విషం అవుతుంది. పిచ్చి ప్రోగ్రామ్స్ చూసి వాళ్ళు నవ్వుతున్నారు కదాని మనమూ నవ్వితే బలవంతంగా శరీరం పుచ్చిపోతుంది. అంత వయసు ఉన్న దీవనలిచ్చారు. అది ఎన్నటికీ మరచిపోలేని విషయమంటారు శ్రీ హరికిషన్.

అనుకోని అనుభూతి:
ఒకసారి రాజమండ్రిలో ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు ముసలావిడ ఒకామె అకాస్మాత్తుగా ఆగిపోయి హరికిషన్ గారి రెండు
కాళ్ళ మీదా పడింది. ఆయన బజారుకని వెళ్ళారు. లేవండమ్మా మీరు నా కాళ్ళమీద పడడమేమిటి.. అంటే... బాబూ టీవీలో కనిపించేది మీరే కదా నాయనా ఎంత నవ్విస్తావు బాబూ.. ఎంత నవ్విస్తావు.. నాదీ నా కుటుంబానిదీ అందరి ఆరోగ్యం, ఆయుష్షు, మీకు రావాలి. ఇంకా ఎంతో మందిని నవ్వించాలని ఆమె ఆనంద భాష్పాలతో దీవించింది. ఇది హరికిషన్ కు ఒక మధురానుభూతి.

విమానంలో మరపురాని అనుభూతి:
హరికిషన్ బృందం షార్జా, మలేషియాలలో ప్రోగ్రామ్ లను పూర్తి చేసుకుని వస్తుండగా ఒకామె అడిగింది. ఆర్ యు హరికిషన్ ...? మీరు ఈటీవీ డూప్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు కదా. రాజశేఖర రెడ్డి వేషంలో ఉన్నారు. టివి లో దూరం నుంచి చూసి అనుకున్నారాజశేఖరరెడ్డికి ఏం గతి పట్టింది టి.వి.లో డూప్స్ లో ఆయన నటించడం ఏమిఘి అనుకున్నా.. కానీ తరువాత మీరని తెలిసింది. అసలు రాజశేఖర రెడ్డిలా అచ్చుగుద్దినట్టున్నారు. వేషమ్, మాట అనుకరణ, అంతా అది భగవంతుడిచ్చిన వరం. మిమ్మల్ని చూసిన ఆనందాన్ని వర్ణించలేక పోతున్నా. అని విమానంలో వేరే వేరే ప్రదేశాలలో ఉన్న వాళ్ళవాళ్ళందరినీ పిలిచి పరిచయం చేశారట. అటువంటి గుర్తింపు ఎంతో ఆనందాన్నిస్తుందంటారు హరికిషన్.

కాక్ పిట్ లో అనుభవం:
కాంధహార్ విమాన హైజాకింగ్ జరిగినపుడు ఉన్న పైలెట్లే ఒకసారి హరికిషన్ ప్రయాణిస్తున్న విమానానికి కూడా పైలట్లుగా ఉన్నారు. వారిని పలకరించి ప్రశంసించాలనిపించిందట. అపుడు తనతో ఉన్న సినీమా ప్రముఖులు కొంతమంది కలసి కాక్ పిట్ లోకి తీసుకెళ్ళి పైలట్లకు పరిచయం చేశారు. అపుడు వారికి నేతాజీ, గాంధీ, ఇందిర, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వంటి ప్రముఖ్హుల మాటలను మిమిక్రీ చేసి వినిపించారు హరికిషన్. వారు ఎంతగానో ఆనందించారు.

ఇటువంటి ఎన్నో అనుభవాలను హరికిషన్ తన స్వంతం చేసుకున్నారు.