అవార్డులు

 • ఒక గంటలో 100 కంఠాలు అనుకరించి 24 మార్చి 2004 న వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఆ సందర్భంగా " శత కంఠ ధ్వన్యనుకరణ ధురీణ " అనే బిరుదు పొందారు.


 • 1989 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం " ఉగాది పురస్కారం " ఇచ్చి సత్కరించింది.
 • చెన్నై కళాసాగర్ వారు " ధ్వన్యనుకరణ సామ్రాట్ " అనే బిరుదునిచ్చారు.
 • సిరిసిల్ల కళాసమితి వారు " ధ్వన్యనుకరణ కళా చక్రవర్తి " అనే బిరుదునిచ్చారు.
 • ట్రిపుల్ స్టార్స్ వారు " ధ్వన్యనుకరణ రారాజు " అనే బిరుదునిచ్చారు.
 • 50 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి మరియు దూరదర్శన్ లలో " 50 సంవత్సరాల స్వాతంత్ర్యం - 50 స్వరాల అనుకరణ " అనే ప్రత్యేక కార్యక్రమాన్ని హరికిషన్ నిర్వహించారు. ఆ సందర్భంలో " " ధ్వనిమిషన్ - హరికిషన్ " అనే బిరుదునిచ్చి సత్కరించారు.
 • ఊయల కమ్యూనికేషన్స్ వారు " ధ్వన్యనుకరణ బ్రహ్మ " అనే బిరుదుతో సన్మానించారు.
 • విజయవాడ కళానిధి వారు "స్వర విన్యాస మాంత్రికుడు " అనే బిరుదిచ్చారు.
 • ఆకృతి ఫౌండేషన్ వారు " మిమిక్రి మిషన్ " అనే బిరుదుతో గౌరవ సన్మానం చేశారు.
 • కువైట్ తెలుగు కళాసమితి వారు "ధ్వన్యనుకరణ కళాతపస్వి" అనే బిరుదుతో సత్కరించారు.
 • శ్రీ హరికిషన్ స్వస్థలమైన ఏలూరులోని స్రవంతి కల్చరల్ ఆర్గనైజేషన్ వారు మీ గళాన్ని మంత్రదండంలా తిప్పుతున్నారని " గళ మాంత్రికుడు " అనే బిరుదుతో ఆత్మీయ సత్కారం చేశారు.


 • ఇంటిగ్రేటెడ్ తెలుగు మరియు వంశీ ఇంటర్నేషనల్ వారు హాస్యనటులు స్వర్గీయ రేలంగి గారి పేరిట ఏర్పాటు చేసిన " రేలంగి అవార్డు " ను హరికిషన్ కు బహూకరించారు మరియు " బహుస్వర కంఠీరవ " అనే బిరుదునిచ్చి సత్కరించారు.
 • ఢిల్లీ తెలుగు అకాడమీ వారు " అంతర్జాతీయ ప్రతిభా పురస్కారం " తో సన్మానించారు.
 • జేసీస్ సంస్థ వారు 2000 వ సంవత్సరంలో " ఈ ఏటి మేటి కళాకారుడు " నే బిరుదుతో సత్కరించారు.
 • కళారాధన సాంస్కృతిక సంశ్థ వారు " మిమిక్రీ రంగంలో 25 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకుగాను "మిమిక్రీ స్టార్ " అవార్డును బహూకరించి ఘనంగా సత్కరించారు.
 • ఊయల ఫౌండేషన్ వారు " స్వరావధాన సామ్రాట్ " బిరుదును మిమిక్రీ రంగంలో 35 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు గాను ప్రదానం చేసి ఆత్మీయ సత్కారం గావించారు.
 • 2005 వ సంవత్సరంలో సింగపూరు తెలుగు సమాజం వారు "విశిష్ఠ కళా పురస్కారం " తో సత్కరించారు.
 • 2006 వ సంవత్సరంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు కౌలాలంపూర్ లోని గెంటింగ్ ఐలాండ్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నందు నిర్వహించారు. ఆ సమయంలో హరికిషన్ ఇచ్చిన ప్రదర్శనకు అంతర్జాతీయ తెలుగు వారందరూ ముగ్ధులై ప్రశంసిస్తూ "స్వర్ణ ధ్వన్యనుకరణ దిగ్గజ కళాకారుడు " అనే బిరుదుతో అత్యద్భుత రీతిలో సన్మానించారు.