హరికిషన్ గురించి


 

మే 30, 1963న ఏలూరులో శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు శ్రీమతి రంగమణి దంపతులకు జన్మించిన హరికిషన్ కు స్వరమే సర్వస్వం..స్వరమే ఆయన జీవితం.

ఆయన పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలోనైనా అక్షరాలు నేర్చింది, పెరిగింది హైదరాబాద్ లోనే.

ఎనిమిదేళ్ళ ప్రాయంలో తన మేనత్త శ్రీమతి చూడామణితో కలిసి విశ్వ విఖ్యాత మిమిక్రీ కళాకారుడు డా. నేరెళ్ళ వేణుమాధవ్ గారి ప్రదర్శనను చూసి ఉత్తేజితుడైన హరికిషన్ ఏనాటికైనా మిమిక్రి కళలో అత్యున్నత స్థానాన్ని పొందాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి చుట్టుపక్కల వారిని, టీచర్లను, తెలిసిన వారిని అనుకరించి నవ్వించేవారు.

వారి ప్రోత్సాహంతో వయసుతోపాటే తన అభిరుచిని పెంచుకున్నారు. తన మొట్టమొదటి ప్రదర్శనను జనవరి 12, 1971న ఇచ్చారు. 12 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా ఫిజిక్స్, మ్యాథ్స్ పాఠాలు చెప్పినా మిమిక్రీని మాత్రం వదలలేదు. ఎప్పటికప్పుడు పరిసరాలను గమనిస్తూ ఇతరుల మాటల ద్వారా, మీడియా అబ్జర్వేషన్ ద్వారా, స్నేహితులు, విశిష్ఠ వ్యక్తుల హావభావాలను గమనిస్తూ వాటికి సమకాలీనతను జోడించి ప్రేక్షకుల నాడిని పసిగట్టి మిమిక్రీ కళలో నిష్ణాతను సంపాదించుకుని అద్భుత ధ్వన్యనుకరణా పటిమను తన స్వంతం చేసుకున్నారు.

ఇప్పటివరకూ 10,000 కు పైగా దేశ, విదేశాలలో ప్రదర్శనలిచ్చి ఎన్నో అవార్డులు, రివార్డులు పొంది తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు.

మిమిక్రీ మాస్టర్, ధ్వనిమిషన్ - హరికిషన్, స్వర్ణ ధ్వన్యనురణ దిగ్గజం, బహు స్వర కంఠీరవ, శత కంఠ ధ్వన్యనుకరణ ధురీణ వంటి అనేకానేక బిరుదులను, సన్మానాలను పొందారు.

మిమిక్రీ కళకు కూడా ప్రాచుర్యాన్ని కలిగించాలనే ఉద్దేశ్యంతో పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ మిమిక్రీ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో మిమిక్రి హరికిషన్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.. ఆయన దగ్గర నేర్చుకున్న వారిలో ఎంతోమంది విద్యార్ధులు ప్రస్తుతం మీడియా యాంకరింగ్, డబ్బింగ్ రంగాలలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు.

తరచూ ఇతర ప్రాంతాల నుండి, జిల్లాల నుండి కళాకారులు ఆయనను కలుసుకోవడానికి వస్తూంటారు. వారికి మిమిక్రీ కళలో మెళుకువలు బోధిస్తుంటారు. విషయాలను చర్చించుకోవడం ద్వారా పరస్పరం ఒక వర్క్ షాపు లాగా జరిగి మరింత మెరుగైన ప్రదర్శనలివ్వడం ఎలా అనేది వారు తెలుసుకోగలుగుతున్నారు.

ఇండియన్ కల్చరల్, తంజావూరు వారి ఆధ్వర్యంలో మిమిక్రీలో డెలిగేట్స్ అందరికీ వర్క్ షాప్ నిర్వహించారు మిమిక్రీ హరికిషన్.

మిమిక్రీని కూడా వృత్తిగా తీసుకోవచ్చని త్రికరణ శుద్ధిగా విశ్వసించి నిరూపించిన హరికిషన్ పెద్దలు, సమకాలీకుల ప్రోత్సాహంతో ధ్వన్యనుకరణ పీఠాన్ని త్వరలో స్థాపించబోతున్నారు.


తల్లితండ్రులు శ్రీ చారియార్ దంపతులుమిమిక్రీ హరికిషన్ పెళ్ళినాటి ఫొటోగ్రాఫ్మిమిక్రీ హరికిషన్ దంపతులుTo Help Mimicry Harikishan, Here are the Bank Particulars:
V. HARIKISHAN
A/C # 860210100024350
IFSC BK ID 0008602
BANK OF INDIA
MALKAJGIRI BRANCH
-----------------------------------------------
Mimicry Harikishan's Phone Number: + 91 98480 12211
Email: mimicryharikishan@gmail.com