మిమిక్రి నేర్చుకుందామనుకుంటున్నారా?

కళలు 64. అందులో మిమిక్రీ కూడా ఒకటి. ప్రేక్షకులను చక్కగా నవ్వించే ప్రక్రియ. అనుకరించి, జోక్స్ చెప్పి లేదా హావభావాలు ప్రకటించి కూడా చెప్పొచ్చు. ప్రధానమైనది అనుకరించి నవ్వించడం. అదే ధ్వన్యనుకరణ. సభా కార్యక్రమాలకు ముందుగాగాని, కార్యక్రమ తదనంతరం గానీ లేదా మొత్తం పూర్తి కార్యక్రమం గా గానీ మిమిక్రీని ప్రదర్శించవచ్చు. మిమిక్రి కళ సభా కార్యక్రమాల్లో విరామ సమయాల్లో ప్రేక్షకులను నవ్వించడంతోనే పరిమితం కాకుండా పూర్తి నిడివి గల మిమిక్రీ షోలు ఎక్కువగా ప్రాచుర్యం పొందాలనే ఉద్దేశ్యంతో ధ్వన్యనుకరణ కళాపీఠం అనే సంస్థను త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ కళాపీఠంలో ఒక సంవత్సరం డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టబోతున్నారు.

ధ్వన్యనుకరణ కళాపీఠంలో..
ఇపుడు కొత్తగా నేర్చుకోవాలనుకునేవారికి, స్వతహాగా ధ్వన్యనుకరణ చేస్తున్న కళాకారులకు కళలో మెళకువలు ప్రదర్శనా పద్ధతులు, సీనియర్, సమకాలీన మిమిక్రీ కళాకారుల సూచనలు, సలహాలు, ఇతర ప్రాంతాల, రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనల సీడీలు కూడా చూపించి ఈ ధ్వన్యనుకరణ మీద పూర్తి స్థాయి పట్టు ప్రదర్శించేలా తీర్చిదిద్దుతారు.

ఇందుకు కావలసిందల్లా స్వతహాగా కొంత అనుభవం, అభినివేశం ఉండాలి. ముఖ్యంగా నేర్చుకోవాలనే తపన ఉండాలి. విద్యావంతులైతే అది వారి వృత్తికి అదనపు అర్హత అవుతుంది.

హరికిషన్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రి విభాగంలో విజిటింగ్ ప్యాకల్టీ గా పనిచేస్తున్నారు. అక్కడ నేర్చుకున్న చాలామంది విద్యార్ధులు డబ్బింగ్, టీవీ ప్రోగ్రామ్ లు, యాంకరింగ్ వంటి వృత్తుల్లో స్థిరపడ్దారు.

ధ్వన్యనుకరణ కళాపీఠం పెద్దల ఆశీస్సులు, సహాయ సహకారాలతో త్వరలో ప్రారంభించబడుతోంది. వివరాలను ఎప్పటికప్పుడు ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.