ప్రదర్శనలు

ఒలింపిక్స్ లో క్రీడాజ్యోతిని వెలిగించి ఎలాగయితే ఒకరి నుంచి ఇంకొకరికి అందించుకుంటుంటారో అదే విధంగా హరికిషన్ తన గురువు గారందించిన మిమిక్రీ కళను తన శక్తి మేరకు తన తుది శ్వాస ఉన్నంతవరకు వన్నె తెచ్చేందుకు అహరహం శ్రమిస్తున్నారు.

12 జనవరి, 1971 న తొలి ప్రదర్శన తో ప్రారంభించి నేటి వరకు అప్రతిహతంగా జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 10,000 కు పైగా ప్రదర్శనలు ఆంధ్రా అంతటా, దేశంలొ కాశ్మీర్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహించారు.

కేవలం భారతదేశానికే హరికిషన్ మిమిక్రీ కళ పరిమితం కాలేదు. విదేశాల్లో సైతం తన విజయకేతనాన్ని ఎగురవేశారు.

దుబాయ్,
షార్జా,
కువైట్,
కత్తార్,
యు.ఎస్.ఏ
సింగపూర్,
లండన్,
బహ్రైన్,
మలేషియా,
కెన్యా
ఉగాండా వంటి ఇంకా అనేక దేశాలలోని భారతీయులను అలరించారు.

తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో అనర్గళంగా తన ధ్వన్యనుకరణ ప్రదర్శనలతో అశేష ప్రజల మనసులను దోచుకున్నారు.

 • గోదావరి పుష్కరాలు
 • కృష్ణా పుష్కరాలు
 • కాలచక్ర ఉత్సవాలు
 • విశాఖ ఉత్సవాలు
 • వేలంగి ఉత్సవాలు, ఏలూరు
 • తెలంగాణ ఉత్సవాలు
 • ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
 • వీధి బాలల కోసం స్పెషల్ కార్నివాల్
 • అంధులు, అనాధ బాలల కోసం ఛారిటీ ప్రదర్శనలు
 • ఖైదీల కొరకు ప్రత్యేక ప్రదర్శనలు
 • కార్గిల్ యుద్ధ సమయంలో మిలిటరీ కొరకు ఛారిటీ ప్రదర్శనలు

వంటి అనేక ప్రభుత్వ ప్రతిష్ఠాకర కార్యక్రమల్లో తన కళను ప్రదర్శించారు.

స్కూళ్ళు, కాలేజీలు, కాకతీయ వంటి యూనివర్సిటీల కార్యక్రమాల్లో కూడా తన విద్యతో యువతను సమ్మోహన పరుస్తూ కళకు ప్రాచుర్యం తీసుకువచ్చారు.

ఇంకా అనేక

 • గవర్నమెంట్ కార్యక్రమాలు
 • టీవీ కార్యక్రమాలు
 • సినిమా ఫంక్షన్లు
 • కల్చరల్ ఫంక్షన్లు
 • పుట్టినరోజు ఫంక్షన్లు
 • పెళ్ళిళ్ళలోనూ
 • ప్రోడక్ట్ లాంఛింగ్స్ లోనూ
 • ఎగ్జిబిషన్లు
 • కార్నివాల్స్ మరియు కార్పొరేట్ ఫంక్షన్లు

వంటి వాటిలో కూడా పాల్గొని నవ్వులు విరబూయిస్తున్నారు.

సత్యం కంప్యూటర్స్, విప్రో, ఎల్.ఐ.సి. ఆఫ్ ఇండియా, కోల్గెట్, వైజాగ్ స్టీల్స్, ప్రియా సిమెంట్స్, శ్రీచక్రా సిమెంట్స్, శ్రీరామ్ ఛిట్ ఫండ్స్, రిలయన్స్, ఎయిర్ టెల్, ఐడియా, బజాజ్, హీరోహోండా, గోద్రేజ్, హాలిడే రిసార్ట్స్, ఐ.సి.ఐ.సి.ఐ.బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్, అసోసియేషన్ ఆఫ్ బ్యాంక్స్.. ఇంకా అనేక కంపెనీల ప్రోడక్ట్ లాంఛింగ్స్ లోనూ కంపెనీ సమావేశాల్లోనూ తన ద్వ్హన్యనుకరణ సమ్మోహనాస్త్రాలను ప్రయోగించి కంపెనీల సిబ్బందిని ఉల్లాస పరుస్తూ నవ్వుల వర్షం కురిపిస్తున్నారు.