ప్రముఖుల ప్రశంసలుమిమిక్రీ పితామహులు
శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్

మిమిక్రీ అనే వటవృక్షంలో లేటెస్ట్ సిగ్నేచర్ హరికిషన్.

 

ఇతని ప్రదర్శనలు చూస్తుంటే నేను 30 సంవత్సరాల క్రితం చేసిన మిమిక్రీ జ్ఞప్తికి వస్తోంది. ఆ రేంజ్ లో హరికిషన్ చేస్తున్నాడు.


ఇప్పుడున్న జనరేషన్ కి, ట్రెండ్ కి తగ్గట్లుగా హరికిషన్ మిమిక్రీ ద్వారా అలరిస్తున్నాడు.

నేను అప్పట్లో చేసిన ప్రదర్శనలు యథాతధంగా కూడా చేస్తున్నాడు.


నా తర్వాత ఈ మిమిక్రీ కళను భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన, ముందుకు తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత హరికిషన్ మీద ఉందని నా అభిప్రాయం.


ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బ్ బెర్గ్

ఒకసారి అమెరికా లాస్ ఏంజిల్స్ లో షూటింగ్ జరుగుతుండగా హరికిషన్ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బ్ బెర్గ్ కలిసినపుడు కొద్దిసేపు మిమిక్రీ చేసేందుకు సమయం లభించింది.

 

సమయంలో జురాసిక్ పార్క్ సన్నివేశాన్ని తన ధ్వన్యనుకరణ ద్వారా ప్రదర్శించారు. అపుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ హరికిషన్ భుజం తట్టి విధంగా స్పందించారు.

 

"మేము కొన్ని వందలాది వాద్య పరికరాలతో వాస్ట్ ఔట్ పుట్ ఉపయోగించి, బియాండ్ ఆడ్యన్స్ రేంజ్ ఉంటేనే సినిమా ఆడుతుంది. నువ్వు కేవలం నీ ఓకల్ కార్డ్స్ ప్రొడ్యూస్ చేసి చేశవంటే నువ్వు సామాన్యమైన ఆర్టిస్టువి కావు. You are Much, Much, Much more more talented than anybody".


స్వర్గీయ నందమూరి తారక రామారావు

శ్రీ నందమూరి తారక రామారావు గారు హరికిషన్ మిమిక్రీని ప్రత్యక్షంగా చూసినపుడు ఆయన తన అభిప్రాయాన్ని విధంగా వ్యక్తపరచినారు..

 

"మమ్ముల్ని చాలా బాగా అనుకరించావు తమ్ముడూ.. మమ్ము మైమరపింపచేశావు"


స్వర్గీయ శ్రీ వై.ఎస్. రాజశేఖర రెడ్డి

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మిమిక్రీ ప్రదర్శనను చూసిన తర్వాత ఈవిధంగా స్పందించారు...

 

బావుందయ్యా.. మిమిక్రీ చాలా బాగా చేశారు. ఎక్కడ నేర్చుకున్నారు.


ఆప్ట్ గా ఉంది. అంతేకాదు 2004 లో కాంగ్రెస్ విజయంలో హరికిషన్ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే అతను కాంగ్రెస్ తరఫున ప్రచారంలో భాగంగా రిలీజ్ చేసిన సీడీలలో తన గళాన్ని ప్రజలకు వినిపించారు.


శ్రీ నారా చంద్రబాబు నాయుడు

ఒకసారి హరికిషన్ గారి ప్రోగ్రామ్ చూడడం జరిగింది.

 

"చాలా బాగా చేశారు. అద్భుతంగా ఉంది ప్రదర్శన."


శ్రీ అమితాబ్ బచ్చన్

ఇంత గొప్ప ప్రతిభ కల కళాకారుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు.

 

నా గొంతును చాలా బాగా ఇమిటేట్ చేశారు. అచ్చు నేనే మాట్లాడుతున్నట్లు ఉంది.

 

హరికిషన్ పరిపూర్ణ అనుకరణ కళాకారుడు.


పద్మభూషన్ మెగాస్టార్ చిరంజీవి

నేను డాడీ సినిమా షూటింగ్ లో ఉండగా బ్రహ్మానందం గారు హరికిషన్ ని నా దగ్గరకి తీసుకొచ్చి ఇప్పుడున్న మిమిక్రీ కళాకారుల్లో అద్భుత పటిమ కలవాడు చాలా బాగా చేస్తాడు అని పరిచయం చేశారు.

 

కొద్దిసేపట్లోనే ఎందరో సినీ ప్రముఖుల కంఠాలను అనుకరించి చూపించారు. చాలా బాగా చేశారు. తర్వాత ఇంద్ర 175 రోజుల ఫంక్షన్ లో ఆయన ప్రోగ్రాం చేసి అందరినీ ఎంతో అలరించారు.

 

మా ఇంట్లోని కార్యక్రమాలలో కూడా మమ్మల్నందరినీ కడుపుబ్బా నవ్వించారు.

 

వారు చేస్తున్న కృషికి మంచి గుర్తింపు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం

నీ గొంతు పలికించగల కంఠాలను అద్భుతంగా పలికించగలవు. అనుమానాస్పదంగా చెప్పడం, దాటవేయడం వంటివి చేయవు. నీ ఉఛ్చారణ 100 శాతం పెర్ఫెక్ట్ గా ఉంటుంది.

 

అందుకే అంతగా ప్రేక్షకుల మనసులకు హత్తుకుంటుంది.


శ్రీ రాళ్ళబండకవితాప్రసాద్

ప్రత్యేకంగా మిమిక్రీ కళకి నిశిత పరిశీలన, ఏకాగ్రత, ధారణ, అనుకరించే విషయం పట్ల అవగాహన... ఇవన్నీ ఎంతో అవసరం. సాధారణ మిమిక్రీ ఆర్టిస్టు కన్నా హరికిషన్ లో ఇవి పుష్కలంగా ఉన్నాయి.

 

అందుకే మిమిక్రీ కళా రంగంలో ఉన్నత స్థానానికి చేరుకున్నారీయన. విన్నకొద్దీ వినాలనిపించే హాస్యంతో కూడిన అనుకరణ హరికిషన్ ది.


సినీ హాస్య నటులు డాక్టర్ బ్రహ్మానందం

నేను హాస్యం అంటే చాలా ఇష్టపడతాను. హరికిషన్ లో నాకు మంచి కళాకారుడు కనిపించాడు. ప్రతిభ ఉన్న కళాకారులను ప్రోత్సహించడం మన విధి. అందుకే తను చేసే ప్రదర్శనల్లో ఎక్కడైనా బాగాలేదనిపిస్తే నిర్మొహమాటంగా బాగాలేదని చెపుతాను. బావుంటే బావుందని మెచ్చుకుంటాను. ఇంకా ఎలా చేస్తే బావుంటుందో సలహాలిస్తాను.

 

హరికిషన్ చేసే మిమిక్రీ వెనుక అతని ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్ కనిపిస్తూంటుంది. ఏదో కొన్ని డైలాగ్ లు ప్రాక్టీసు చేసేసి ప్రదర్శనలివ్వడం కాకుండా అప్పటికప్పుడు ఐనా సరే సందర్చానుసారం ప్రేక్షకులకు నచ్చే రీతిలో ప్రదర్శనలివ్వగల నేర్పరి మిమిక్రీ హరికిషన్.


శ్రీ బి.వి.పట్టాభిరామ్

హరికిషన్ స్థాయికి ఒక రాత్రికి రాత్రే రాలేదు. ఎన్నో పగళ్ళు, రాత్రుళ్ళు సాధన చేస్తేనే స్థాయికి రాగలిగారు.

అంతటి అనుకరణ శక్తి అతనికి భగవంతుడు ఇచ్చాడు. అది ఒక ఎనర్జీ మరియు ఒక పవర్.

 

హరికిషన్ కేవలం మిమిక్రీ కి మాత్రమే పరిమితమై ఉండలేదు. నటనలోకి వెళ్ళాడు. ఎడ్వర్ట్యయిజ్ మెంట్లు యాడ్ ప్రమోషన్లు వంటివి చేస్తున్నాడు. సినిమా వాళ్ళ కంఠాలను స్టేజ్ మీదే కాక వివిధ ఫీల్డ్స్ లో చేశాడు. అదిక కవరేజ్ ఉంది.

 

ఇపుడు కొత్తగా వచ్చే కళాకారులు అందరూ కూడా ఆయన్ని అనుకరించాలి. మరియు ఆదర్శంగా తీసుకుని అనేక విధాలుగా తమ కళను వృధ్ధి చేసుకోకపోతే ప్రొఫెనల్ గా రాణించడం బహు కష్టం.


మిమిక్రీ శ్రీనివాస్

హరికిషన్ లో స్వత:సిద్ద ప్రతిభ ఉంది. అతను ఆంజనేయుడి వంటివాడు. అతని ప్రతిభ అతనికి తెలియనంత కళా పరిపూర్ణుడు.

 

మంచి నైపుణ్యం కల కళాకారుడు, మిమిక్రీ కళకు భవిష్యత్తుల్లో ఉజ్వల భవిష్యత్తును తీసుకురాగల సమర్ధుడు హరికిషన్.


డాక్టర్ సి. నారాయణ్ రెడ్డి గారు

కేవలం వ్యక్తుల కంఠాలను అనుకరించడమే కాకుండా వాళ్ళ యొక్క హావభావాలను పలికించడంలో హరికిషన్ ప్రైమరి ఇమిటేషన్ కు పెట్టింది పేరు. అద్భుత రసానుభూతిని కలిగించే కళ ఇది. దీంట్లో అత్యున్నత స్థాయికి అతి తక్కువ సమయంలో పైకి వచ్చాడు. ఇంకా పైకొస్తాడు. కొత్త బాణీల మిమిక్రీ చేశాడు. రైళ్ళు, విమానాలు, ఏనుగు, కుక్కలు వంటిజంతువుల ఇమిటేషనే కాకుండా ఒక ఉదంతాన్ని తీసుకుని అందులో ఇమిడ్చి ఇమిటేట్ చేయగల దిట్ట.