ప్రత్యేకతలు

తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో అనర్గళంగా తన ధ్వన్యనుకరణ ప్రదర్శనలతో అశేష ప్రజల మనసు దోచుకున్నారు.

పరిసరాలు, స్నేహితులు, సన్నిహితులు, పొలిటికల్ పర్సన్స్, మీడియా వార్తలు ఇలా అనేక రకాలుగా ప్రస్తుత కాల, మాన పరిస్థితులను బేరీజువేసుకుంటూ వాటితో సమయానుకూలంగా ఏ విధంగా హాస్యం పండించవచ్చో తెలిసిన వ్యక్తి.

ప్రేక్షకులకు ఏం కావాలో, ఏదైతో నచ్చుతుందొ ఎలా చెప్తే నవ్వుతారో ఆ విధంగా తన ప్రదర్శనను మలుచుకుని, క్లాస్, మాస్, కార్పొరేట్..ఇలా అనేక రకాల వారిని, ప్రదర్శనలను తిలకించడానికి వచ్చిన వారిని బట్టి, సందర్భాన్ని బట్టి తన ప్రదర్శనలో అప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసుకుని అలరించగల దిట్ట.

విశిష్ట వ్యక్తుల కంఠాల అనుకరణ, జంతువుల అనుకరణ, వాహనాల అనుకరణలకే పరిమితం కాకుండా..సొంతంగా ఎన్నో టాపిక్ లను రచించుకుంటారు. అవి తర్వాత కళాకారులకు అనుకరణీయాలవుతున్నాయి.

వాటిల్లో ముఖ్యమైనవి:

 • జురాసిక్ పార్క్
 • బుద్ధుడి విగ్రహం అనుకరణ
 • క్రికెట్ మ్యాచ్ అనుకరణ
 • కౌన్ బనేగా కరోడ్ పతి (పేరడీ) మొదలైనవి.

అనేకానేక సినిమాల్లోని సన్నివేశాలను యథాతథంగా అనుకరించడం ఆయన ప్రత్యేకత. అందులో ముఖ్యమైనవి.

  • డైనోసార్
  • మమ్మీ
  • జురాసిక్ పార్క్
  • మమ్మీ రిటర్న్స్
  • టెన్ కమెండ్ మెంట్స్ ...ఇంకా మరెన్నో..