టి.వి కార్యక్రమాల్లో


ఈటీవి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10:30 నుండి 11:00గంటల వరకు నవ్వితే నవరత్నాలు హాస్య కార్యక్రమాన్ని 552 ఎపిసోడ్లు ఏకధాటిగా పూర్తిచేసిన అద్భుతమైన కళాకారుడు హరికిషన్. వన్ మేన్ షోగా ఒకేసారి వందలాది ఎపిసోడ్ లు ఒకే వ్యక్తి వివిధ వేషాలతో, వివిధ మాండలికాల్లో మిమిక్రి బేస్డ్ గా చేసి కోట్లాది మంది రాష్ట్ర ప్రజల మన్ననలను పొందడం విశేషం.

అదే రీతిలో ప్రజాదరణ పొందిన మరొక కార్యక్రమం సి.ఎమ్. - ఎ.ఎమ్ టు పి.ఎమ్ అనే పొలిటికల్, సెటైరికల్, పేరడీ షో జీ - తెలుగు ఛానల్ లో 250 ఎపిసోడ్లు ప్రదర్శితమయ్యి సంవత్సరన్నపాటు అలరించి హరికిషన్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

 

ఈ టీవీలో నా మొగుడు నాకే సొంతం అనే సీరియల్ లో నటించారు.

టీవీలలో ప్రోగ్రామ్ ల ప్రోమోలకు వాయిస్ ఓవర్ చెప్పారు.
ఉదాహరణకు : అమృతం సీరియల్ ప్రోమో

పలు టీవీ అడ్వర్టయిజ్ మెంట్లకు వాయిస్ ఓవర్ చెప్పారు. వాటిలో కొన్ని:
నంది పైప్స్
కఫ్ సిరప్
బెనెడ్రిల్
వాన్ సాఫ్ట్ ..ఇంకా మరెన్నో..